ప్రతి మండలానికో స్కూల్ మోడల్ గా మార్చాలి 

  • పాఠశాలల అభివృద్ధి కేవలం ప్రభుత్వ బాధ్యతగానే కాకుండా, ప్రజా ఉద్యమంగా సాగాలి 
     
  • జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

 విశ్వంభర, సూర్యాపేట: విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి విద్యా కేంద్రాలుగా మార్చడమే లక్ష్యంగా  భవిష్యత్ తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను సమగ్ర రూపాంతరం చేయాలని  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. గురువారం విద్యా శాఖ అధికారులతో వెబ్ ఎక్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తదుపరి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలం నుండి ఒక ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసి, వాటిని దశలవారీగా మోడల్ స్కూల్స్"గా అభివృద్ధి చేయాలని తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాలల ప్రస్తుత పరిస్థితి, అవసరాలను బట్టి వాటిని గ్రేడ్-I, గ్రేడ్-II, గ్రేడ్-III కేటగిరీలుగా విభజించాలన్నారు.  తొలి దశలో ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య, భవిష్యత్ నైపుణ్యాలు, సమాజ భాగస్వామ్యంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. మరుగుదొడ్లు, సురక్షితమైన తాగునీరు, నిరంతర విద్యుత్ సదుపాయం, తరగతి గదుల మరమ్మతులు, ఫర్నిచర్,  అధునాతన కంప్యూటర్ ల్యాబ్‌లు, సైన్స్ ల్యాబ్‌లు, డిజిటల్ లైబ్రెరీలు,  క్రీడా మైదానాల అభివృద్ధి, పాఠశాల ఆవరణ సుందరీకరణ చేపట్టాలని వెల్లడించారు. ప్రభుత్వ నిధులతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత భాగస్వామ్యాల ద్వారా ఈ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, కోడింగ్, డిజిటల్ లిటరసీ, కమ్యూనికేషన్ స్కిల్స్,  లీడర్‌షిప్ క్వాలిటీస్, కెరీర్ గైడెన్స్ కోచింగ్ లను మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా మార్చేందుకు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని తెలిపారు. పాఠశాలల అభివృద్ధి కేవలం ప్రభుత్వ బాధ్యతగానే కాకుండా, ఒక ప్రజా ఉద్యమంగా సాగాలని ఇందుకోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, తల్లిదండ్రుల కమిటీలు, పూర్వ విద్యార్థుల సంఘాలు, దాతలు, మరియు ప్రజాప్రతినిధులను ఈ మహాత్కార్యంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యుత్తమ విద్యా కేంద్రాలుగా మార్చడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.  కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శిరీష, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, కోఆర్డినేటర్ శ్రావణ్ కుమార్, డిప్యూటీ రమేష్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/every-mandal-should-be-converted-into-a-school-model/article-16747

Tags: