ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి

  • ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 

విశ్వంభర, శంషాబాద్: ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటడమే కాకుండా, వాటిని కంటికి రెప్పలా సంరక్షించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ మండల పరిధిలోని మల్కారం గ్రామంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నవన మహోత్సవం కార్యక్రమాన్ని గురువారం  అటవీశాఖ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  స్థానిక ఎమ్మెల్యే  టి. ప్రకాష్ గౌడ్,  అటవీ శాఖ అధికారులతో  కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసి, స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. పచ్చదనం పెంపొందించడం, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మన అందరి సామాజిక బాధ్యత అని గుర్తుచేశారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటడమే కాకుండా, వాటిని కంటికి రెప్పలా సంరక్షించాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  సీనియర్ నాయకులు చంద్ర రెడ్డి,  దండు ఇస్తారి, గడ్డం శేఖర్ యాదవ్, శివాజీ, యాదగిరి రెడ్డి, గొపాల్, బిక్షపతి, కే బిక్షపతి, ప్రభాకర్, మహేందర్, శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు,వార్డు సభ్యులు,  అధికారులు,  పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/everyone-should-take-care-of-plants/article-16725

Tags: