వావిలాల లో ఘనంగా బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం
విశ్వంభర, నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాల గ్రామంలో నూతన బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త మద్దెల రాజేష్ గౌడ్ ఆహ్వానం మేరకు పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవర ప్రకాష్ రెడ్డి, రమేష్ చందర్ రెడ్డి, నెల్లికుదురు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, కేసముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్ రావు, బాలాజీ నాయక్, ఆకుతోట సతీష్ తదితర నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి బొడ్రాయి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గ్రామాల్లో సంప్రదాయాలు, సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఐక్యంగా కలిసి ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా భక్తుల రద్దీతో కార్యక్రమం ఘన విజయవంతమైంది.