ఓయూలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం 

ఓయూలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం 

విశ్వంభర, తార్నాక : “వ్యక్తిగత వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కావు” అంటూ ఓయూ విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ గురుకులాల సెక్రటరీ డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, బాడీ షేమింగ్‌కు నిరసనగా గురువారం హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు వ్యక్తిగత దూషణలకు దిగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. రాజకీయ భేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయికి దిగజారడం సరైంది కాదని పేర్కొన్నారు. ఈ ఘటనతో ఓయూ క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొనగా, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు మోహరించారు. ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/effigy-of-chief-minister-burnt-in-ou/article-16753

Tags: