పెన్నా సిమెంట్ కార్మికులకు ఒప్పందం

పెన్నా సిమెంట్ కార్మికులకు ఒప్పందం

  • ఏఐటీయూసీ – యాజమాన్యం మధ్య చర్చలు విజయవంతం

విశ్వంభర, హైదరాబాదు : కార్మికుల హక్కుల పరిరక్షణకు కీలక ఒప్పందం కుదిరిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ తెలిపారు. హైదరాబాదు రీజనల్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) కార్యాలయంలో పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, యాజమాన్యం మధ్య కన్సిలేషన్ ఆఫీసర్ జె. సరవణన్ సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా కార్మికులకు బోనస్, గ్రాట్యుటీ చెల్లింపు, నూనె, బెల్లం సరఫరా, సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్‌లు, టీ సౌకర్యం కల్పించేందుకు అంగీకరించారు. అదేవిధంగా నెలకు 26 పని దినాలు, ఎర్న్డ్ లీవ్, సేఫ్టీ పరికరాలు అందించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతనాల ప్రకారం వేతనాలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో  ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్, యూనియన్ ప్రధాన కార్యదర్శి దశరథ్ గౌడ్, మేనేజ్మెంట్ ప్రతినిధులు మంజునాథ్, ఉమామహేశ్వరరావు, మల్లికార్జున్, జావేద్, యూనియన్ నాయకులు రాజేశ్వర్ రెడ్డి, పాండు, రబ్బాని, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/contract-for-penna-cement-workers/article-16714

Tags: