ఉమ్రా యాత్రకు  బయలుదేరిన భక్తులు

ఉమ్రా యాత్రకు  బయలుదేరిన భక్తులు

విశ్వంభర, శంషాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సౌదీ ఎయిర్లైన్స్ విమానంలో ఉమ్రా యాత్రకు భక్తులు బుధవారం బయలుదేరారు. ఇస్లామిక్ నూతన సంవత్సరం ను పురస్కరించుకొని  అల్ మిజన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో  ఉమ్రా యాత్ర చేసుకోవడానికి శంషాబాద్  విమానాశ్రయం నుండి  53 మందికి పైగా ప్రయాణికులు  బయలుదేరారు. ఈ యాత్రలో తెలంగాణ రాష్ట్ర లోని తాండూర్, వికారాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ కర్నూలు వాసులు  ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులకు వారి కుటుంబ సభ్యులు ఘన వీడ్కోలు పలికారు. అల్ మిజాన్ టూర్స్ అండ్ ట్రావెల్స్  మేనేజర్  మహమ్మద్ ఫవ్వద్ అలీ మాట్లాడుతూ... ఇస్లామిక్ నూతన సంవత్సరంలో ప్రయాణికులు మొదటి ఉమ్రా యాత్ర చేసుకోవడం సంతోషకరం  అన్నారు. అల్ మిజన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ ఫయాజ్ అలీ హజ్ యాత్ర లో ఉన్నారని, హజ్ యాత్ర పూర్తి కాగానే ఈ  ప్రయాణికులను జిద్దా ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకుని ఈ ప్రయాణికులతో కలిసి ఉమ్ర కూడా  నిర్వహించుకుంటారని తెలిపారు. పుణ్యక్షేత్రాలను సందేశం సందర్శించడం ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందని సంవత్సరానికి ఒక్కసారైనా మక్కా మదీనా లాంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని సూచించారు. మక్కా మదీనాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తే దైవచింతలతో పాటు మనసుకు ప్రశాంతత లభిస్తుందన్నారు.

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/devotees-leaving-for-umrah-yatra/article-16708

Tags: