ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించిన ఎంపీడీవో
విశ్వంభర, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) జి. జలందర్ రెడ్డి , డీఈ హౌసింగ్, ఏఈ హౌసింగ్ అధికారులు, సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులతో కలిసి లోతుకుంట, నర్సాయిగూడెం గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా గుడిసెల్లో నివసిస్తున్న లబ్ధిదారుల పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకుని, ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గృహ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి, నిర్ణీత గడువులోపు పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులను ప్రోత్సహించారు. ప్రభుత్వం పేదల గృహావసరాలను తీర్చేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని శాశ్వత గృహాలను నిర్మించుకోవాలని ఎంపీడీవో జలేందర్ రెడ్డి తెలిపారు.