రామన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక
విశ్వంభర, రామన్నపేట: నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పున్న జగన్ మోహన్ కు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. మండల అధ్యక్షుడిగా పున్న జగన్ మోహన్ నిరంతరం పార్టీ అభివృద్ధికి కృషి చేసి కార్యకర్తలకు అండగా ఉండాలని కోరారు. కొత్త బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించి పార్టీని మరింత బలోపేతం చేయాలని వేముల వీరేశం ఆశాభావం వ్యక్తం చేశారు.