మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

విశ్వంభర, బండకొత్తపల్లి:  గ్రామంలో మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. గ్రామ సర్పంచ్ గద్వాల ఉపేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోపాలదాస్ యాదగిరి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గద్వాల ఉపేందర్ మాట్లాడుతూ, గ్రామ ప్రజల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణ శంకుస్థాపనతో బండకొత్తపల్లిలో భక్తి వాతావరణం నెలకొంది.

🕒 12 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/foundation-stone-of-mahankali-ammavari-temple-construction/article-16529

Tags: