కెవిఆర్ జన్మదిన సందర్భంగా వృద్ధులకు అన్నదానం 

విశ్వంభర, చింతపల్లి: సిరి మహాలక్ష్మి ఇన్ఫ్రా డెవలపర్స్ వ్యవస్థాపకులు, చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త కల్లం వెంకటేశ్వర రెడ్డి జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని వృద్ధాశ్రమంలో సిరి మహాలక్ష్మి ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో బుధవారం వృద్ధులకు అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని పలు గ్రామాలలో కెవిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొని, మిఠాయిలను పంచిపెట్టారు. కె.వి.ఆర్ మాట్లాడుతూ సిరి మహాలక్ష్మి డెవలపర్స్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతానన్నారు. ఆయా గ్రామాల అభివృద్ధికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

🕒 11 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/annadanam-to-the-elderly-on-the-occasion-of-kvrs-birthday/article-16463

Tags: