హుస్నాబాద్‌లోనే ఆర్డీఓ, ఎమ్మార్వో కార్యాలయాలు ఏర్పాటు చేయాలి

విశ్వంభర, హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్డీఓ, ఎమ్మార్వో (ఐఓసీ) కార్యాలయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రైతు రక్షణ సమితి హుస్నాబాద్ డివిజన్ అధ్యక్షుడు అయిలేని మల్లికార్జున రెడ్డి తెలిపారు.ప్రతిరోజూ భూ, రెవెన్యూ సంబంధిత పనుల కోసం వందలాది మంది ప్రజలు ఈ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోందని, రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడంతో పేదలు మరింత ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. బస్సులో వెళ్లినా కొంత దూరం నడిచి వెళ్లాల్సి వస్తోందని, కార్యాలయాలకు చేరుకున్న తర్వాత అధికారులు అందుబాటులో లేకపోతే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటోందన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజల సౌకర్యాలను పక్కనపెట్టి తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. హుస్నాబాద్ పట్టణంలోని పాత ఎమ్మార్వో కార్యాలయ స్థలంలోనే నూతన భవనాలు నిర్మించే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు పూర్తి కాలేదన్నారు. శంకుస్థాపన చేసిన భవన నిర్మాణ పనులు కూడా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజల సమస్యల దృష్ట్యా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ఆర్డీఓ, ఎమ్మార్వో కార్యాలయాలను హుస్నాబాద్ పట్టణంలోనే అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజల రాకపోకల ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

🕒 12 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/rdo-mmaro-offices-should-be-set-up-in-husnabad-itself/article-16550

Tags: