రూ.60.79 కోట్లతో అభివృద్ధి

రూ.60.79 కోట్లతో అభివృద్ధి

  • మాజీ కార్పొరేటర్ బి. పద్మ వెంకటరెడ్డి 

విశ్వంభర, అంబర్ పేట : బాగ్ అంబర్ పేట్ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని మాజీ కార్పొరేటర్ బి. పద్మ వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం బాగ్ అంబర్పేట డివిజన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మ వెంకటరెడ్డి మాట్లాడుతూ  గత ఐదేళ్ల పదవీకాలంలో రూ.60.79 కోట్లతో డివిజన్‌లో మౌలిక వసతులను విస్తృతంగా అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజీ, వాటర్ లైన్లు, విద్యుత్ వంటి ప్రధాన పనులను అన్ని బస్తీలు, కాలనీల్లో చేపట్టినట్లు పేర్కొన్నారు. జిహెచ్ఎంసి ద్వారా రూ.46.16 కోట్లు, వాటర్ వర్క్స్ ద్వారా రూ.20.63 కోట్లతో పనులు నిర్వహించినట్లు వివరించారు. బతుకమ్మ కుంట, మల్లికార్జున నగర్, పోచమ్మ బస్తి, శాంతినగర్ ప్రాంతాల్లో కలుషిత నీటి సమస్యను పరిష్కరించి కొత్త పైపులైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకున్నామని, ఎస్‌ఎన్‌డిపి ద్వారా ముంపు సమస్య నివారణకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నందనవనం రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.1.70 కోట్లు మంజూరై త్వరలో పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. డివిజన్ అభివృద్ధికి ప్రజలు, కాలనీ సంఘాలు, అధికారులు సహకరించారని, అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Tags: