రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
On
విశ్వంభర, మేడిపల్లి: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. బృందావన్ కాలనీ లో నివసించే బండారి నరసింహులు (48) బార్బర్ షాప్ నడుపుతున్నాడు. గత రెండు రోజుల క్రితం షాప్ మూసివేసి ఇంటికి వెళ్తుండగా ఓ వ్యక్తి పల్సర్ బండి పై వెనుకనుండి నిర్లక్ష్యం గా వాహనం నడుపుతూ నరసింహులు ను ఢీ కొట్టాడు. నరసింహులు కింద పడిపోవడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అతని కొడుకు ఈశ్వర్ కు సమాచారం అందించారు. వెంటనే అతనిని అభయ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడినుండి నిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ బండారి నరసింహులు శనివారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు ఈశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



