ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

  • ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు జనగాం రాజ్‌కుమార్

విశ్వంభర, హుస్నాబాద్ : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, శాఖల వారీగా ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎఐవైఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జనగాం రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు.ఈ మేరకు సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్‌కు ఎఐవైఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.అలాగే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాలకు బదులుగా శాశ్వత నియామకాలు చేపట్టాలని, టీజీపీఎస్సీ ద్వారా వార్షిక నియామక క్యాలెండర్ విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యా, వైద్య రంగాల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి అంతయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు బిచ్చాల శ్రీనివాస్, ఎండీ అయూబ్, దండుగుల రాజు, శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

🕒 12 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/govt-job-vacancies-should-be-filled-immediately/article-16554

Tags: