నెల్లికుదురు మండలంలో ముగిసిన గ్రామసభలు

నెల్లికుదురు మండలంలో ముగిసిన గ్రామసభలు

విశ్వంభర, నెల్లికుదురు: వ్యవసాయం, రెవిన్యూ, ఇరిగేషన్, విద్య, వైద్యం, విద్యుత్, డస్ట్ బిన్ విధానం తదితర సమస్యలపై నెల్లికుదురు మండలంలో నిర్వహిస్తున్న ప్రత్యేక గ్రామసభలు బుధవారంతో ముగిసాయి. హనుమాన్ నగర్ తండాలో సర్పంచి గుగులోతు అశోక్ కుమార్, రాజుల కొత్తపల్లి సర్పంచి కొండా జనార్దన్ రెడ్డి, బ్రాహ్మణ కొత్తపల్లి డా.చిర్ర యాకాంతం గౌడ్,పార్వతమ్మ గూడెం లో సర్పంచి పూలమ్మ,ఆలేరు నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి, దుర్గాభవాని తండా భూక్య వీరన్న ల అధ్యక్షతన జరిగిన కొన్ని గ్రామ సభలకు ఎంపీవో పద్మ, అన్ని సభలకు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు హాజరయ్యారు. సంబంధిత అధికారులు పలు విషయాలపై ఆయా గ్రామాల ప్రజల కు అవగాహన కల్పించారు.పలు సమస్యలను గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకురాగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.డస్ట్ బిన్ విధానం పై అవగాహన కల్పించారు. పచ్చ,నీలం,ఎరుపు,నలుపు డబ్బాలో ఏయే చెత్త ఉంచాలో సంబంధిత నిపుణులు వివరించారు. హనుమాన్ నగర్ తండా రాజుల కొత్తపల్లి పంచాయతీ కార్యదర్శులు ఆంజనేయులు,శ్రీధర్, ఉపసర్పంచి శ్రీలత యాకు ఆయా గ్రామాలలో ఉపసర్పంచ్లు పంచాయతీ కార్యదర్శి ప్రజలు పాల్గొన్నారు.

🕒 11 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/gram-sabhas-concluded-in-nellikuduru-mandal/article-16512

Tags: