నూతన సర్పంచ్ గుండాల అశోక్ ఉపసర్పంచ్ రాహుల్ గుప్తకు ఘన సన్మానం 

నూతన సర్పంచ్ గుండాల అశోక్ ఉపసర్పంచ్ రాహుల్ గుప్తకు ఘన సన్మానం 

విశ్వంభర, షాబాద్ :-గ్రామానికి నూతన సర్పంచ్ గా ఎన్నికైన గుండాల అశోక్ కుమార్ కి ఉపసర్పంచ్ దండు రాహుల్ గుప్తకి ఆర్యవైశ్య మహాసభ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం రమేష్ గుప్త ఆధ్వర్యంలో  షాబాద్  గ్రామంలో ఓంశాంతి భవనంలో ఆర్యవైశ్య సంఘం నాయకుల సమక్షంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మున్ముందు ఎన్నో ఉన్నత మైన పదవులు పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు సీనియర్ పాత్రికేయులు ఏబీఎన్ రిపోర్టర్ శ్రీనివాస్ గుప్తా,  దండు మదన్ గుప్తా, సాయిరాం, గార్లపాటి నరసింహులు ,గడ్డం కిషోర్, పబ్బ ప్రవీణ్, యాచం కృష్ణ, గడ్డం శివకుమార్, రాకేష్ మహాసభ రంగారెడ్డి జిల్లా కన్వీనర్, రమణ, సంగమేశ్వర్, వెంకటేష్, దండు మానెమ్మ, దండు ధనమ్మ, పేపర్ బుచ్చమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Tags: