నాయీ బ్రాహ్మణులు రాజకీయంగా రాణించాలి . - బీసీ,ఎస్సీ,ఎస్టీ రైట్స్ , రాజ్యాధికార సాధన జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విశారదన్ మహారాజ్.
నాయీ బ్రాహ్మణుల డిమాండ్లు నెరవేర్చాలి. - నాయి బ్రాహ్మణ జన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పునుంతల బాలకృష్ణ.
విశ్వంభర, హైదరాబాదు, ఎల్ .బి.నగర్.:- నాయి బ్రాహ్మణ జన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పునుంతల బాలకృష్ణ ఆధ్వర్యంలో నేడు ఎల్బీనగర్ చౌరస్తా నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు తలపెట్టిన నాయి బ్రాహ్మణ జన జాగృతి పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్ & రాజ్యాధికార సాధన జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విశారదన్ మహారాజ్ విచ్చేసి మహనీయులు జ్యోతిరావు పూలే,రాజ్యంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం. వారు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు తమ హక్కుల కోసం వారు సమాజంలో ఎదుర్కొంటున్న వివక్ష, నాయి బ్రాహ్మణ జన జాగృతి ఆధ్వర్యంలో తలపెట్టిన పాదయాత్రకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ వారి పక్షాన నిలబడి, వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వారికి అండగా ఉంటానని తెలిపారు. రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తూ,అగ్రవర్ణాల రాజ్యంపై యుద్ధం చేసేందుకు నేనెప్పుడూ ముందుంటానని రానున్నది బహుజనుల రాజ్యమేనని, పోలీసులు పాదయాత్రని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు.అనంతరం జన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పునంతల బాలకృష్ణ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కొరకై మా సామాజిక వర్గం పై జరుగుతున్న వివక్ష, మా కులవృత్తిపై కార్పొరేట్ శక్తులు ప్రవేశించి మా బ్రతుకుతెరువుపై దెబ్బ కొడుతున్న దానికి నిరసనగా.. అదేవిధంగా బీసీ సామాజిక వర్గంలో అత్యంత వెనుకబడిన మా నాయి బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలని చౌరస్తాలలో ఏర్పాటుకు ఐదు నుంచి పది లక్షల వరకు వడ్డీరేని రుణాలను మంజూరు చేయాలని, ప్రభుత్వం భర్తీ చేసే నామినేటెడ్ పదవుల్లో నాయి బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వాలని,బిసి 42% రిజర్వేషన్లు ఉప వర్గీకరణ చేసి నాయి బ్రాహ్మణులకు సామాజిక న్యాయం చేయాలనే ప్రధాన డిమాండ్లతో తలపెట్టిన నేటి నాయి బ్రాహ్మణుల పాదయాత్రకు ప్రభుత్వం,పోలీసు యంత్రాంగం అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి ప్రారంభ దశలోనే పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్య పరిష్కరం కొరకు ప్రభుత్వం పై నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ, పోలీసులు ఇట్టి పాదయాత్ర కార్యక్రమాన్ని దౌర్జన్యం గా అడ్డుకోవడం ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ.. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చుడతామని, ప్రజా పాలనలో ప్రజల విజ్ఞప్తులు వినే పరిస్థితులు లేవని ఉప్పునుంతల బాలకృష్ణ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు .ఎల్బీనగర్ చౌరస్తా లో ప్రారంభ దశలోనే నాయి బ్రాహ్మణ జన జాగృతి పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు, నాయి బ్రాహ్మణులు పోలీసులు అడ్డుకున్న సరే మా కార్యక్రమాన్ని పూర్తిచేస్తామనే శపథంతో వివిధ మార్గాల ద్వారా వాహనాలు మరియు ఇతర మార్గాల ద్వారా గమ్యానికి చేరుకొని ట్యాంక్ బండ్ దగ్గర భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి వినతిపత్రం సమర్పించిన నాయి బ్రాహ్మణులు.. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ జన జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిళ్ళ ప్రవీణ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శికిలమెట్ల ప్రభాకర్, సలహాదారుడు కొత్తపల్లి రవి, నాయకులు పి. బిక్షపతి, ఎం.ప్రవీణ్, శ్రీకాంత్,యాదగిరి, హరీష్, రాజు, కొలనుపాక రాములు, నాగపురి, సికిలమెట్ల శ్రీనివాస్, ఆంజనేయులు, కిరణ్, నరేష్, హేమెంధర్, సత్యనారాయణ,రాసమల్ల శివలింగం , మహిళలు, ఎస్సీ, ఎస్టీ ,బీసీ ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



