అగ్నిమాపక శాఖ అవగాహన కార్యక్రమం 

అగ్నిమాపక శాఖ అవగాహన కార్యక్రమం 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని నాగార్జున స్కూలులో మంగళవారం రోజు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం సంభవించి నప్పుడు ఆందోళన చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పెట్రోలు పంపులలో మంటలు చెలరేగినప్పుడు నీళ్ళు కాకుండా ఇసుక, కార్బన్-డై-ఆక్సైడ్, ఫోమ్ ద్వారా ఎలా అదుపు చేస్తారో అవగాహన కల్పించారు. భవనాల్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెలువడే దట్టమైన పొగ కారణంగా ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ సమయంలో చేతి రుమాలు మన ముఖానికి చుట్టుకొని నేలపై ప్రాకుతూ ప్రమాదం నుండి భయపడాలని సూచించారు. ఫైర్ ఇంజన్ లో వాటర్ ఫిల్లింగ్ ఇతర ఉపకరణాలు ఎలా ఉపయోగిస్తారో విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండంట్ డాక్టర్ నాగరాజు.ఎన్, ఫైర్ స్టేషన్ ఆఫీసర్ మధుసూధన్ రెడ్డి, లీడింగ్ ఫైర్ ఫైటర్ ఆర్.భీకు, డ్రైవర్ కాశీరాం, ఫైర్ ఫైటర్స్ జే.వెంకటేశ్వర్లు, సిచ్.మధు, పాఠశాల బోధన సిబ్బంది పాల్గొన్నారు.

Tags: