భారీగా మద్యం పట్టివేత
విశ్వంభర, హైదరాబాద్: ఎక్సైజ్ యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం ఆదేశాల మేరకు ఎయిర్పోర్టు నుంచి వస్తున్నటువంటి మద్యాన్ని పట్టుకున్నారు. ఢిల్లీ గోవా ప్రాంతాల నుంచి వస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బి సి అండ్ డి టీముల సిఐలు భిక్షా రెడ్డి, వెంకటేశ్వర్లు, నాగరాజు సిబ్బంది కలిసి ఢిల్లీ, గోవా నుంచి మద్యం వస్తున్నట్లుగా సమాచారం రావడంతో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ బయట రోడ్డుపై వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 99 ఢిల్లీ, గోవాకు చెందినటువంటి మద్యం బాటిల్లను సీజ్ చేశారు.శంషాబాద్ రోడ్డు లో శంషాబాద్ డిటిఎఫ్ సిఐ ప్రవీణ్ కుమార్, శేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్ ఎస్ఐ కిరణ్, చేవెళ్ల ఎక్సైజ్ స్టేషన్ ఎస్ఐ వెంకటెశ్వర్ రెడ్డి, శంషాబాద్ సిఐ దేవేందర్ రావు సిబ్బంది కలిసి ఎయిర్పోర్టు నుంచి వస్తున్న ఎన్డిపిఎల్ మద్యాన్ని పట్టుకోవడానికి శంషాబాద్ రోడ్ లో వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో 85 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. 12 మంది పై కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో 1084 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం బాటిల్ల విలువ రూ.3.68 లక్షలు ఉంటుందని అంచనా.



