16నుండి సిపిఎం నిరవధిక నిరహార దీక్షలు

16నుండి సిపిఎం నిరవధిక నిరహార దీక్షలు

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్ర్దంలోని  ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చి రాబోయే రాష్ట్ర బడ్జెట్లో 40 కోట్ల రూపాయల కేటాయించి నూతన భవనం నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి జరిగే నిరవధిక నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు. స్థానిక రామన్నపేట మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో నిరాహార దీక్షల కరపత్రాన్ని అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 60 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రి పరిసర మండల, గ్రామాల ప్రజలకు వైద్య సౌకర్యాలు అందిస్తూ నేడు సమస్యల వలయంలో ఉన్నదని అన్నారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేటు ఆసుపత్రులని ఆశ్రయించాల్సి వస్తుందని, రోజుకు 400 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నప్పటికీ, కనీసం రోగులకు తగ్గ డాక్టర్లు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సార్లు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం, అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ప్రజలు అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ పాలకులు చొరవ చూపడం లేదని అన్నారు. ఎన్నికలప్పుడు ప్రజలను మాయమాటలు చెప్పి మభ్యపెట్టడం తప్ప అడుగు ముందుకు పడడం లేదని, ఏరియా ఆసుపత్రి బోర్డు పెట్టి 15 సంవత్సరాలు గడుస్తున్నా, ఇప్పటికీ 30 పడకలకే పరిమితమైందని అన్నారు. వెంటనే వచ్చే బడ్జెట్ సమావేశల్లో వంద పడకల ఆసుపత్రికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, లేని పక్షంలో మండల వ్యాప్త ప్రజలను సమీకరించి ఆందోళన ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో టీడీపీ మండల నాయకులు ఫజల్ బేగ్, సిపిఐ మండల నాయకులు రచ్చ యాదగిరి, ఏంఆర్పిఎస్ మండల అధ్యక్షులు నోముల చిరంజీవి, సిపిఎం జిల్లా కమిటి సభ్యులు వనం ఉపేందర్, మండల కార్యవర్గ సభ్యులు బోయిని ఆనంద్, కందుల హనుమతు, మండల కమిటి సభ్యులు గొరిగే సోములు, గన్నేబోయిన విజయభాస్కర్, ఎండీ రషీద్, బావండ్లపల్లి బాలరాజు, బోడిగే రజిత, పట్టణ శాఖ కార్యదర్శి మునికుంట్ల లెనిన్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటి సభ్యులు ఆవనగంటి స్వామి, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గంటెపాక శివ కుమార్, దుబ్బాక సర్పంచ్ గట్టు నర్సింహా, పల్లె సత్యం, మేడి గణేష్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు శానగొండ రామచంద్రం, శాఖ కార్యదర్శులు గోగు లింగస్వామి, శానగొండ వెంకటేశ్వర్లు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: