తుకారాంగేట్  పీఎస్ ను అడ్డగుట్టలో కలపొద్దు

తుకారాంగేట్  పీఎస్ ను అడ్డగుట్టలో కలపొద్దు

విశ్వంభర, బషీర్ బాగ్: తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రాంతాల సరిహద్దులను లాలాగూడ పోలీస్ స్టేషనకు లింకు చేయొద్దని అడ్డగుట్ట డివిజన్ అఖిలపక్ష వివిధ పార్టీల  నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం బషీర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  బీజేపీ సీనియర్ నాయకుడు నర్సింగ్ రావు మాట్లాడుతూ మార్పులు చేర్పుల కారణంగా అడ్డగుట్ట, తుకారాంగేట్ ప్రాంతవాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రవాణా సౌకర్యం లేని లాలాగూడ పీఎస్  లో కలుపడం సరైంది కాదన్నారు. ఈ విషయంపై డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్ లను  కలిసి వినతి పత్రం అందచేశామన్నారు. దీనిపై సీపీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. కాగా రెండు నెలలు అవుతున్న సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ అడ్డగుట్ట డివిజన్ లోనే ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నేతలు మల్లేష్, చందర్, శ్రీరామ్ నాయక్, మహమ్మద్ నిజోమొద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

Tags: