భూదాన్ భూములు రక్షించాలని కలెక్టర్ కు వినతి

విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బేతోలు గ్రామ రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూములపై రియల్టర్ల కన్నుపడింది. అధికారులతో కుమ్మక్కై రికార్డులను తారుమారు చేసి ముమ్మరంగా క్రయవిక్రయాలను కొనసాగిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అక్రమార్కుల నుంచి సంబంధిత భూములను రక్షించాలని కోరుతూ బేతోలు గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ బాబా తో పాటు గ్రామస్తులు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కు వినతి పత్రం అందజేశారు . అనంతరం ఖాదర్ బాబా  మాట్లాడుతూ,  సర్వే నెం. 56 లో 20. 34 ఎకరాలు,  సర్వేనెంబర్ 280లో 20.33 ఎకరాల భూమి భూదాన్ యజ్ఞం బోర్డు పేరఉంది.గతంలో ఈ భూములకు ధర ఎక్కువగా లేదు. ఈ మధ్యలో ఎకరానికి కోటికి పైగా పలుకుటుండటంతో  భూ కబ్జాకోరులు అధికారుల అండదండలతో కబ్జాలకు పాల్పడుతున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ సంబంధిత భూదాన్ యజ్ఞం బోర్డుకి చెందిన భూములను స్వాధీనం చేసుకొని  హద్దులు నిర్ణయించాలని కోరారు.

Tags: