శ్రీరామనవమి వేడుకల పై ప్రత్యేక సమావేశం
విశ్వంభర, మహేశ్వరం :మహేశ్వరం మండల కేంద్రంలోని శ్రీ అక్కన్న మాదన్న గడికోట ప్రాంగణంలో ఈనెల 27న జరిగే, శ్రీరామనవమి సందర్భంగా, సీతారాముల వారి కళ్యాణం మహోత్సవం సందర్భంగా, మహేశ్వరం గడి కోటలోనే శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధం చేసుకోవడం కోసం,గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, మహేశ్వరం గ్రామంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు జరుపుకోవాలని, గడికోటకు కళ్యాణ మండపనికి రంగులు వేయించాలని కళ్యాణునికి ఏర్పాటు చేసే కార్యక్రమాలను తొందరగా ప్రతి ఒక్కరు సహకరించి శ్రీరామనవని వేడుకలు అంగరంగ వైభవంగా,నిర్వహించుకోవాలని గ్రామ పెద్దలు గ్రామస్తులు కోరారు. సీతారాముల వారి ఆశీస్సులు మన గ్రామం పై ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్, ఉప సర్పంచ్ జోరల రమేష్, శివగంగ చైర్మన్ అల్లే కుమార్ , కర్రోళ్ల చంద్రయ్య ముదిరాజ్ , మాజీ ఎంపిటిసి పోతర్ల సుదర్శన్ యాదవ్ , పొద్దుటూరి శ్రీధర్, అనిల్ గౌడ్, దుడ్డు క్రిష్ణ యాదవ్, ఒగ్గు లింగం, ఒగ్గు స్వామి, ఆశనగరి కుమార్, ఎం సత్యనారాయణ, సన్నిల్లా శివ ముదిరాజ్ , కనపురo రవి, సిద్దు, గద్దగూటి వెంకటేష్, మోదీని చంద్రకాంత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



