ప్రగతి ప్రణాళిక పనులు పరిశీలన

ప్రగతి ప్రణాళిక పనులు పరిశీలన

 విశ్వంభర, ఇనుగుర్తి: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మండల కేంద్రం ఇనుగుర్తిలో నిర్వహిస్తున్న పనులను జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్ మంగళవారం ఎంపీడీవో బండారు పార్థసారథి తో కలిసి పరిశీలించారు. గ్రామపంచాయతీని సందర్శించి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల పనుల అమలును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు చేపట్టిన శానిటేషన్ వర్క్స్ ను విజిట్ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కు చెందిన పనులను సమర్ధవంతంగా, వేగంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మి కాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags: