అమరవీరులకు నివాళి
On
విశ్వంభర, నాంపల్లి : గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి నాయకులు. మార్చి 10 మిలియన్ మార్చ్ స్ఫూర్తిగా తీసుకుని మంగళవారం హైదరాబాదు గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె రూబీ స్టీవెన్ సన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిండిగా వెంకన్న, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



