మహిళలు వంటింటికే పరిమితం కాకూడదు
విశ్వంభర, బర్కత్ పుర: స్త్రీలు ఎక్కడైతే గౌరవింపబడతారో అక్కడ సమాజం సుభిక్షంగా ఉంటుంది, మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించినప్పుడే స్త్రీజాతికి నిజమైన గుర్తింపు లభిస్తుంది అని హైందవి కళాశాలల వైస్ చైర్మన్ గడ్డం స్వర్ణలత అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, నగర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాదు బర్కత్పుర హైందవి కళాశాలలో మంగళవారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన 55 మంది మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చట్టసభల్లో మహిళలకు అవకాశం కల్పించినప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన స్పూర్తి ఏర్పడుతుందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా రాణించినప్పుడే సమాజంలో గౌరవం పెరుగుతుందని తెలిపారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బాగ్ అంబర్‌పేట్ మాజీ కార్పొరేటర్ పద్మావతి డిపి రెడ్డి, దేవిరెడ్డి విజితారెడ్డి, ప్రియాంక,వేదుల శాంతి , వాణి, ఆపర్ణ, అనుపమ, , సుధా, పవిత్ర, పల్లవి తదితరులు పాల్గొన్నారు.



