రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
విశ్వంభర, చింతపల్లి: ప్రతి ఒక్కరూ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండల పరిధిలోని తిదేడు గ్రామంలో శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టెశ్వర్యాలతో ఆనందంగా మెలగాలని మనస్పూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని ఆయన అన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యా నాయక్, కంకణాల వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ స్వప్న శేఖర్ రెడ్డి, కోండల్ నాయక్, నిరంజన్ గౌడ్, శీమర్ల క్రిష్ణ యాదవ్, మోతిరాం నాయక్, జైపాల్ నాయక్, గడ్డం శేఖర్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



