సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం

సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం

విశ్వంభర, సంగారెడ్డి : సావిత్రిబాయి ఫూలే ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో సమానత్వాన్ని, మహిళా విద్యా హక్కులను ప్రతి ఒక్కరు కర్తవ్యంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని పార్నంది అనిల్ కుమార్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో సావిత్రిబాయి ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సావిత్రిబాయి ఫూలే గారు మహిళా విద్యా హక్కుల కోసం, దళితులు మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాటం చేశారు. భర్త జ్యోతిరావు ఫూలే గారితో కలిసి బాలికల కోసం తొలి పాఠశాలను ప్రారంభించి, మహిళా విద్యకు కొత్త దారిని చూపించారు. సమాజంలో అజ్ఞానం, మూఢనమ్మకాలు, అసమానతలపై నిరంతరం పోరాడి, మహిళల సాధికారత, సమాన హక్కులు, విద్యా విస్తరణలో శాశ్వత సేవలు అందించారు. ఈ సందర్భంగా యువత, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు ఆమె ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

Tags: