మాదకద్రవ్యాల నిర్మూలన పై అవగాహన సదస్సు
విశ్వంభర, హనుమకొండ: కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం,తీసుకున్న 99 రోజుల ప్రోగ్రాం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా డ్రగ్స్,గుడుంబా,గంజాయి , మత్తు,పదార్థాలనియంత్రపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. కాజిపేట్ సిఐ సుధాకర్ ,ఈగల్ ఫోర్స్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 62వ డివిజన్ కార్పొరేటర్ ముఖ్య అతిథిగా జక్కుల రవీందర్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా జక్కుల రవీందర్ యాదవ్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మాదకద్రవ్యాల నిర్మూలనకు పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, సమాజం కలిసి పనిచేయాలని కోరారు. విద్యార్థులు డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు తమ ఖాళీ సమయాన్ని క్రీడలకు కేటాయిస్తూ కోకో, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలు ఆడితే శారీరకంగా,మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సుధాకర్ మాట్లాడుతూ, ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని యువత డ్రగ్స్ బారిన పడి వారి భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారని అలాంటి సామాజిక రుగ్మతని అందరం కలిసి ఈ సమాజం నుండి వెలి వేయాలని అన్నారు. మాదక ద్రవ్యాల వ్యసనం వ్యక్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయటమే కాకుండా వారి కుటుంబంతో పాటు మొత్తం సమాజాన్ని దెబ్బతీస్తుంది అని అన్నారు. మాధకద్రవ్యాల నియంత్రణ కై 24 గంటలు తమకి అందుబాటులో ఉంటామని, డ్రగ్స్ వాటి వాడకం రవాణా లపై ఎలాంటి సమాచారం ఉన్న తమకి తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు.



