మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన కలెక్టర్

మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన కలెక్టర్

విశ్వంభర, మహబూబాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందనీ జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం నరసింహలపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి పిల్లలతో స్వయంగా మాట్లాడారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజలకు క్షేత్రస్థాయిలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు పై కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్, ఫైళ్ళ క్లియరెన్స్, కార్యాలయాల పరిసరాల పరిశుభ్రత లపై ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లా వ్యాప్తంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణ మోడల్ స్కూల్ నరసింహలపేటలో పిల్లల అందిస్తున్న సౌకర్యాలు, విద్య బోధనలపై పిల్లలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు,. ప్రభుత్వం కల్పిస్తున్న కామన్ డైట్ మెనూను పకడ్బందీగా అమలు చేయాలని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటే చదువుపై దృష్టి సారించి ముందుకు వెళ్తాన్నారు, సబ్జెక్టుల వారిగా పిల్లల విద్యా సామర్ధ్యాలను పరిశీలించాలని వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తమ విద్యా బోధనలు అందించాలని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థుల హాజరు వివరాలను పరిశీలించారు, రానున్న పరీక్షల నేపథ్యంలో  షెడ్యూలు ప్రకారం ఏర్పాట్లు చేయాలని, సంబంధిత సిబ్బందికి సూచించారు.

Tags: