గుంటూరుపల్లి గ్రామంలో 60 ఏళ్లు పూర్తి చేసుకున్న వృద్ధ దంపతుల ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు.

గుంటూరుపల్లి గ్రామంలో 60 ఏళ్లు పూర్తి చేసుకున్న వృద్ధ దంపతుల ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు.

విశ్వంభర హనుమకొండ జిల్లా ;- హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని గుంటూరుపల్లి గ్రామంలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధ దంపతులను గౌరవిస్తూ గుంటూరుపల్లి గ్రామ సర్పంచ్  రామ్ చౌదరి, ఉప సర్పంచ్ గణేష్ నాగేంద్ర, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే  విశ్రాంత ఐపీఎస్ అధికారి  కె.ఆర్. నాగరాజు, కాజీపేట ఏసిపి  పింగిలి ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర కమ్మ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  గంగవరపు శ్రీరామ్ కృష్ణ ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు  రావుపాటి వెంకటేశ్వర్ రావు,  త్రిపురనేని సుబ్రహ్మణ్యం తదితర ప్రముఖులు హాజరై వృద్ధ దంపతులను ఘనంగా సన్మానించారు....అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.గ్రామ సమాజానికి వృద్ధులు మార్గదర్శకులని, వారి అనుభవం, త్యాగాలు నేటి తరాలకు ఆదర్శమని అన్నారు. 60 సంవత్సరాలు కలిసి జీవితం సాగించిన వృద్ధ దంపతులను సన్మానించడం ఎంతో గొప్ప సంప్రదాయమని, ఇలాంటి కార్యక్రమాలు కుటుంబ విలువలను, సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించే సంస్కృతి మన భారతీయ సమాజానికి ప్రత్యేక గుర్తింపని, యువత ఈ విలువలను తప్పక అనుసరించాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు సమన్వయంతో పనిచేస్తే మరిన్ని మంచి కార్యక్రమాలు సాధ్యమవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా సన్మానానికి అర్హులైన వృద్ధ దంపతులకు ఎమ్మెల్యే నాగరాజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను ఆయన అభినందించారు.

Tags: