కాలేజీల సమస్యలపై కలెక్టర్ సమీక్ష 

కాలేజీల సమస్యలపై కలెక్టర్ సమీక్ష 

విశ్వంభర, సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వ గర్ల్స్, బాయ్స్ హాస్టళ్లు, హై స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి తక్షణ పరిష్కారాలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆమె సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  నియోజకవర్గంలోని హాస్టళ్లు, పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న సమస్యలను పూర్తిగా గుర్తించి, అవసరమైన వసతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ఏప్రిల్ 10వ తేదీ లోపు తనకు సమర్పించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ,  ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పరిశ్రమల సీఎస్ఆర్ నిధులలో 60 శాతం వినియోగించడంతో పాటు మిగిలిన 40 శాతం నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో సమకూర్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సరైన వసతులు అందేలా కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో పాల్గొన్నవారు. ఈ రివ్యూ సమావేశంలో సిపిఒ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.

Tags: