బాధిత కుటుంబానికి లక్ష యాభై వేల సాయం
On
విశ్వంభర, నిజామాబాద్: ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామ వాస్తవ్యులు బండి రవికుమార్ ఇటీవలే అనారోగ్యం తో బాధపడుతూ సర్జరీ కోసం నిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి విన్నవించడంతో ఆయన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి అనసూయ సీతక్క ద్వారా రూ.1,50,000 ఎల్ ఓసీ కాపీని బాధిత కుటుంబ సభ్యులకు పివిఆర్ భవన్ లో అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ సింగిరెడ్డి, మోహన్, ఆర్మూర్ మండల్ జనరల్ సెక్రటరీ సుంకరి రవికుమార్ ,మేదరి లింబాద్రి,బండి సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.



