బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
విశ్వంభర, చింతపల్లి : భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ రథోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా గుట్టపై కొలువుదీరిన భవాని రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా పంటలు పండాలని కోరుకున్నారు. అనంతరం తీదేడు గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా తీదేడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉల్పాల స్వప్న శేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఇడమొని వెంకటయ్య యాదవ్, మాజీ సర్పంచులు కాయితీ జితేందర్ రెడ్డి, దాసరి శ్రీనివాస్ యాదవ్, అధికారులు ఎంపీడీవో సుజాత, ఎంపీఓ ఇందూజ, హౌసింగ్ ఏఈ చందు, కార్యదర్శి అశోక్, మండల పార్టీ అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, దొంతం సంజీవరెడ్డి, టి పిసిసి మెంబర్ సిరాజ్ ఖాన్, నల్ల రఘుమారెడ్డి, ఎరుకల వెంకటయ్య గౌడ్, ముచ్చర్ల యాదగిరి, వడ్త్య దేవేందర్ నాయక్, ఆలంపల్లి నరసింహ్మ, పున్న వెంకటేష్, కాసారపు శ్రీనివాస్, లింగంపల్లి వెంకటయ్య, ధరణిపతి రమణారావు, ఎండి సిద్ధిక్ బాబా, ఎల్లంకి రాధాకిషన్, నర్సిరెడ్డి, కొరివి యాదగిరి, ఎస్.కె బాలేమియా గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



