ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ

ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ

విశ్వంభర, బోడుప్పల్: గ్రేటర్ హైదరాబాద్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని ప్రధాన రహదారి ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో ఉన్న మజీద్ హీకుతాబ్ షాహీ అలంగీరి వద్ద ఈ బిల్లాల్ లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, హజ్ కమిటీ మెంబర్ మహమ్మద్ ముజీబ్రుద్దీన్ హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,  రంజాన్ పర్వదినం శాంతి, సోదరభావం మరియు సేవాభావానికి ప్రతీక అని తెలిపారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నర్సింహా రెడ్డి, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గం బీ బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, అలియాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ శిరీష కృష్ణారెడ్డి, కొత్త ప్రభాకర్ గౌడ్, విశ్వం గుప్త, మాజీ కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, 0 బొమ్మక్ కళ్యాణ్,బింగి జంగయ్య యాదవ్, సీసా వెంకటేష్ గౌడ్, సింగిరెడ్డి పద్మారెడ్డి, చీరాల నరసింహ, సుమన్ నాయక్, పుల్లకండ్ల జంగారెడ్డి, గుర్రాల వెంకటేష్ యాదవ్, రాపోలు ఉపేంద్వర్, సింగిరెడ్డి రాజు రెడ్డి,అంబాలా అరవింద్, పి. రాహుల్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: