ప్రజా పాలన పేరుతో కొత్త డ్రామా

ప్రజా పాలన పేరుతో కొత్త డ్రామా

విశ్వంభర, బషీర్ బాగ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక  99 రోజుల యాక్షన్ ప్లాన్ పేరుతో  కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టినట్టేనని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్  రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజి రెడ్డి విమర్శించారు.బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో  నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,  ప్రభుత్వం ఎంతో ఘనంగా ప్రకటించిన ఈ 99 రోజుల ప్రణాళికలో స్పష్టమైన కార్యాచరణ కనిపించడం లేదన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన ప్రయోజనం కలుగుతుందో ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించాలని కోరారు.99 రోజుల వ్యవధిని ప్రభుత్వం ఏ ప్రాతిపదికన నిర్ణయించిందో ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించిందో కూడా వివరాలు వెల్లడించాలని అన్నారు.కేవలం ప్రకటనలు చేసి ప్రజలను ఆకట్టుకోవడం కాకుండా, ఆచరణలో అమలు అయ్యే విధంగా స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని పేర్కొన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు, కూలీలు, యువత, మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు ఆర్.వి. ప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యులు బి. రాములు యాదవ్, అందే బీరయ్య, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: