నూతన పంచాంగం ఆవిష్కరణ

నూతన పంచాంగం ఆవిష్కరణ

 విశ్వంభర, సదాశివపేట: కొలనుభారతి పంచాంగ ఆవిష్కరణ సంగారెడ్డి జిల్లా జంగమ అర్చక పురోహితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సదశివపేటలోని స్థానిక పెద్ద మఠం నందు అర్చకుల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా జంగమ పురోహిత అర్చక  సంఘం అధ్యక్షులు మడుపతి సంతోష్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బసవలింగస్వామి, కోశాధికారి శివప్రసాద్ స్వామి, కార్యచరణ అధ్యక్షులు అయ్యప్ప స్వామి, సలహాదారు నాగస్వామి, ప్రవీణ్ స్వామి, వీరస్వామి, నరేష్ స్వామి, పెద్దమఠం లింగానంద స్వామి శివకోటి స్వామి పాల్గొన్నారు.

Tags: