హోటల్స్, రెస్టారెంట్లలు నాణ్యతను పాటించాలి. -మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం

హోటల్స్ రెస్టారెంట్లలో తనిఖీలను ముమ్మరం చేస్తాం.

హోటల్స్, రెస్టారెంట్లలు నాణ్యతను పాటించాలి. -మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం

విశ్వంభర, చండూర్ :-ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక  కార్యక్రమములో భాగంగా  మున్సిపల్ కమీషనర్ ఎల్. మల్లేశం ఆదేశముల మేరకు ఈ రోజు తేది:11.03.2026 న చండూరు మున్సిపాలిటీ పరిధిలో గల హోటల్స్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్స్,  బేకరి షాపులపై తనిఖి నిర్వహించడం జరిగింది. ఇట్టి తనిఖిలో నాణ్యత పాటించకుండా మరియు సింగల్ యూస్ ప్లాస్టిక్ కవర్లతో షాపుల యాజమానులు వ్యాపారం నిర్వహించడం జరుగుతుంది. కావున తనిఖిలో నాణ్యత పాటించని మరియు సింగల్ యూస్ ప్లాస్టిక్ కవర్ల ను వినియోగిస్తున్న హోటల్స్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్స్,  బేకరిల షాపుల యాజమనుదారులకు రూ. 7,500/- లు  జరిమానా విధించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మల్లేశం మాట్లాడుతూ హోటల్స్, రెస్టారెంట్లలో నాణ్యతను పాటించాలని, ఏ రోజుకు ఆ రోజు వంటలు చేయాలని, ఫ్రిజ్జల్లో నిలువ ఉంచిన చికెన్, మటన్ మరియు వండిన కూరలను వాడరాదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఇకనుండి మున్సిపాలిటీ లో ఉన్న అన్ని రెస్టారెంట్లు, హోటల్స్, టిఫిన్ సెంటర్లు, బేకరీలకు తనిఖీలు ముమ్మరం  చేస్తామని తెలిపారు.

     ఇట్టి తనిఖిలో వార్డ్ అధికారులు జి. శ్రీరాములు, బి. సాయిరాం, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎమ్. అరవింద్ రెడ్డి మరియు బిల్ కల్లెక్టర్స్ జి. మహేష్, జి. రమేష్, పి. మంజుల పాల్గొనడం జరిగింది.

Read More  రూ.5 కోట్ల ఆస్తులు సీజ్.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు షాక్

Tags: