కర్మన్ ఘాట్ అలయ పాలక మండలి సమావేశం
విశ్వంభర, కర్మన్ ఘాట్:కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానంలో ఉగాది, శ్రీరామ నవమి పర్వదినాలను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థము చేయవలసిన ఏర్పాట్ల విషయమై ఆలయ కార్యనిర్వహణాధికారి, చైర్మన్, ధర్మకర్తలు, ఆలయ అర్చకులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణము, చండీ హోమము, శ్రీ రామ నవమి రోజున సీతారామచంద్ర స్వామి వార్ల కళ్యాణము సందర్భంగా భక్తులు వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, శ్రీ హనుమజ్జయంతి రోజున మన్యుసూక్త సహిత హనుమత్ హోమము, ప్రత్యేక అభిషేకములు భక్తులకు ఎలాంటి అసౌకర్యము లేకుండా దర్శనములు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని, మంచి నీరు, మజ్జిగ, ప్రసాదములు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆలయ అర్చకులు, సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు. అన్ని పర్వదినములు అత్యంత వైభవంగా నిర్వహించి దేవాలయ ప్రతిష్ఠ ఇనుమడించేలా చూడాలని, ఇందుకు గాను ఆలయ పాలక మండలి ఆలయ కార్యనిర్వహణాధికారికి,అర్చక సిబ్బందికి తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందించగలమని తెలిపారు.
కార్యక్రమములో ఆలయ కార్యనిర్వహణాధికారి యన్. లావణ్య, చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ, ధర్మకర్తలు దిండు ప్రవీణ్ గౌడ్, తోకటి కిరణ్ కుమార్, సింగంశెట్టి శ్రీనివాస్, జనుంపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, నారాయణ్ దుర్గా రెడ్డి, కుకునూరి గోపాల్ రెడ్డి, శ్రీమతి కె. కవిత, ఓరుగంటి నరేష్, కొండ్ర సంతోష్ కుమార్, బండిగారి శ్రీనివాస్ గౌడ్, ఎనుముల రవీందర్ రెడ్డి, శ్రీమతి యం. రాజేశ్వరి, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాజీపేట సీ.ఐ .సుధాకర్,ఎస్.ఐ లు వెంకటరమణ ,నవీన్ కుమార్, పోలీస్ సిబ్బంది,పాఠశాల ప్రిన్సిపాల్,ఉపాధ్యాయుల, ఉపాధ్యాయురాళ్లు,పీ.టీ మాస్టర్, యూత్ సభ్యులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



