తడి, పొడి చెత్త నిర్వహణపై అవగాహన

తడి, పొడి చెత్త నిర్వహణపై అవగాహన

విశ్వంభర, మహబూబాబాద్:  మంగళవారం శీత్లాతండా గ్రామం మహబూబాబాద్ మండలంలో మహబూబాబాద్ జిల్లా తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ క్షేత్ర పర్యటన ప్రోగ్రాంలో భాగంగా ఘన వ్యర్ధాల వేరు చేయు విధానంపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే శీత్లాతండా లో ఉన్న ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాన్ని సందర్శించారు. తడి ,పొడి చెత్త వేరు చేయడం కంపోస్టు ఎరువు తయారీ విధానాన్ని, టి. ఎన్. జి. సి కోఆర్డినేటర్ సూర్య కిరణ్ మరియు ఎస్ .బి .ఎన్ .జి కోఆర్డినేటర్ సిహెచ్ రవికుమార్, ఎకో క్లబ్ కోఆర్డినేటర్ జూపూడి అనిల్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి లక్ష్మణ్ నాయక్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని సూచిస్తూనే తడి చెత్తను పొడి చెత్తను తమ దైనందిన జీవితంలో అనుసరిస్తూ ముందుకెళ్లాలని వివరించారు.శీత్లా తండా గ్రామ సర్పంచ్ కళావతి కమ్లి బావ్ సింగ్ గారు హాజరై తడి పొడి చెత్తను ఏ విధంగా వేరు చేయాలో మన దైనందిన జీవితంలో దానిని ఏ విధంగా అనువదించుకోవాలో వివరించడం జరిగింది. పంచాయతీ కార్యదర్శి శ్రీ  హరిగారు , రమేష్ రెడ్డి ఏపీఓ గారు,  శ్రీ బండారి శ్రీనివాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ నరేష్ అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సీనియర్ అసిస్టెంట్ కే సందీప్ ,  మరియు విద్యార్థిని విద్యార్థులు, పారిశుద్ధ కార్మికులు మొదలైన వారు పాల్గొన్నారు.

Tags: