చర్లపల్లి – కామాఖ్య మధ్య కొత్త అమృత భారత్ రైలు 

చర్లపల్లి – కామాఖ్య మధ్య కొత్త అమృత భారత్ రైలు 

విశ్వంభర,  హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని చర్లపల్లి , అసోం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య మధ్య స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్‌లతో కొత్త అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు  మార్చి 13నుండి ప్రారంభం కానుంది. ఈ కొత్త రైలు సేవ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అసోం రాష్ట్రంతో అనుసంధానిస్తుంది. ఈ రైలు ప్రారంభం వల్ల ముఖ్యంగా ఉత్తర–తూర్పు భారతదేశానికి ప్రయాణించే దూర ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ సౌకర్యం లభిస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్  సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రయాణించే సమయంలో ఈ రైలు రెండు దిశల్లోనూ క్రింది స్టేషన్లలో ఆగుతుంది:శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు . నల్గొండల్లో ఆగుతుంది.

Tags: