సమస్యల పరిష్కారానికి కార్యాచరణ
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం వెండి తండ గ్రామంలో 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో గ్రామపంచాయతీలో ప్రజల కనీస సౌకర్యాలు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల పనితీరు మెరుగు పరచడం ద్వారా వార్డుల వారీగా సమస్యలు పరిష్కరించినందుకు యంత్రాంగం ప్రత్యేక కార్యచరణ ప్రారంభించిందని మహేశ్వరం మండలం వెండి తండా సర్పంచ్ అరుణ గోపాల్ నాయక్ పేర్కొన్నారు, ప్రజా పాలన ప్రతి ప్రణాళిక ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గ్రామ ఉపసర్పంచ్ వార్డు మెంబర్స్ తో కలిసి గ్రామంలో పారిశుద్ధ పనులు నిర్వహించారు, ప్రకృతి పల్లెవనం అదేవిధంగా రోడ్లు వీధులను అనేక పరిశుద్ధ పనులను చేపడుతున్నట్లు తెలిపారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజులు స్పెషల్ డ్రైవ్ చేపడుతుండగా శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిందని ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీలో ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో, సర్పంచ్ అరుణ గోపాల్ నాయక్, ఉప సర్పంచ్ సురేఖ సురేష్, వార్డు మెంబర్స్, రాణి భాస్కర్, చందర్, హరిలాల్, ప్రియాంక వెంకటేష్, సామ్లి గోవిందు, సాయిరాం, అంజి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



