మహిళా క్రీడోత్సవాలకు ఎమ్మెల్యే గూడెం
విశ్వంభర, పటాన్ చెరు : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మైత్రి మైదానంలో నిర్వహించిన మహిళా క్రీడోత్సవాలను మంగళవారం ఉదయం పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ స్థాయిలో రెండు రోజులపాటు మహిళా క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలు క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ఆనందకరమని, ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన జీవనం కోసం క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించారు.మార్చి 12న పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో వేలాదిమంది మహిళలతో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడల్లో పాల్గొంటున్న మహిళలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మండల విద్యాశాఖ అధికారులు నాగేశ్వరరావు, రాములు, సుధాకర్, సిఐ వినాయక్ రెడ్డి, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు, మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు.



