సావిత్రిబాయి పూలే వర్ధంతి 

సావిత్రిబాయి పూలే వర్ధంతి 

విశ్వంభర, నాగర్ కర్నూల్: బాలికల చదువు కోసం బాటలు వేసిన గొప్ప సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే అని ఎస్ సి, ఎస్ టి, బి సి ,  మైనార్టీ మండల సంఘాల నాయకులు పేర్కొన్నారు. మంగళవారం  బిజీనాపల్లి మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే 129 వర్ధంతి ఘనంగా నిర్వహించి ఆమెకు నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, ఆడపిల్లలు చదువుకుంటేనే సమాజం బాగుపడుతుందని భావించి, వారికి విద్యనందించడంలో ఎనలేని కృషి చేసిన ధైర్యశాలి సావిత్రిబాయి పూలే అని అన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ సమానత్వం కోసం పాటుపడిన సావిత్రిబాయి  జీవితం స్ఫూర్తిదాయకమని చెప్పారు. బాలికలతో పాటు దళితులకు విద్యనందించడంలో, వితంతువుల జీవితాల్లో వెలుగులు నింపడంలో, రోగులకు సేవ చేయడంలో సావిత్రిబాయి దిక్సూచిగా నిలిచారని పేర్కొన్నారు.

Tags: