మోడల్ స్కూల్ తనిఖీ 

మోడల్ స్కూల్ తనిఖీ 

విశ్వంభర,కేసముద్రం: కేసముద్రం మండలం కల్వల మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో  ముఖ్యమంత్రి చేపట్టిన, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక భాగంలో కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం  ఏ ఎం ఓ శ్రీరాములు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,  పదవ తరగతిలో మంచి ఫలితాలు రావాలని ఎక్కువ విద్యార్థులు త్రిబుల్ ఐటీ కి వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సి, డి గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. 100 శాతం ఫలితాలు రావాలని అన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం, తరగతి గదులు,  లైబ్రరీ, సైన్స్ ల్యాబ్లు తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఈఓ కాలేరు యాదగిరి, ప్రిన్సిపాల్ పరిమి నవీన్, మద్దినేని వీరబాబు, దుర్గా ప్రసాద్, పార్థసారథి, యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags: