ఘట్కేసర్ లో క్రీడా పోటీలు
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కల్పన 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ పోచారం పరిధిలోని చౌదరిగుడలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను మంగళవారం ఏర్పాటు చేశారు.ఈ క్రికెట్ టోర్నమెంట్ కి ముఖ్యఅతిథిగా మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా భద్రారెడ్డి మాట్లాడుతూ, మల్లారెడ్డికి యువత అంటే చాలా మక్కువ అని, మల్లారెడ్డి ఎప్పుడు యువతను ప్రోత్సహిస్తూ ఉత్సాహ పరుస్తుంటాడని అన్నారు. మల్లారెడ్డి అభిరుచిని గుర్తించి ఆయన 50వ వివాహ వసంతం సందర్భంగా సామల సందీప్ రెడ్డి, ఈ క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది అన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్లో ఉమ్మడి ఘట్కేసర్ మండలంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన టీంలు పాల్గొంటారని తెలిపారు. గెలుపొందిన విజేతలకు ఈనెల 17న బహుమతులు అందజేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



