ఆలయ ప్రహారి కోసం నిధులు కేటాయించాలి
On
విశ్వంభర,ఇనుగుర్తి: శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రహరి నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరుతూ ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ కు వినతి పత్రం అందజేశారు. మానుకోట లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఈ మేరకు సంఘం నాయకులు కాంగ్రెస్ జిల్లా నేత బైరు అశోక్ గౌడ్ తో కలిసి ఈ మేరకు ఎమ్మెల్యేను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పోలోజు ఈశ్వరా చారి,ఉపసర్పంచి తుమ్మనపల్లి సతీష్ చారి, వార్డు సభ్యులు మునిగంటి సరిత రాజు చారి, సంఘం గౌరవ అధ్యక్షులు పోలోజు సోమేశ్వర చారి,రిటైర్డ్ ఏఎస్ఐ పోలోజు మదనాచారి,మునిగంటి రామాచారి తదితరులు పాల్గొన్నారు.



