మహేశ్వరం గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ 

మహేశ్వరం గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ 

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలంలో  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, కందుకూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి తో కలిసి మహేశ్వరం మండలంలో మహేశ్వరం, సిరిగిరి పూర్  గ్రామాలను సందర్శించారు. ముందుగా మహేశ్వరం  తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన తాసిల్దార్ భవన నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూరుస్తామని వెంటనే పనులను మొదలుపెట్టాలని సూచించారు.అలాగే మండల ఇన్చార్జ్ ఎంపీడీవో తో మాట్లాడి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు అలాగే ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అన్ని ఇండ్లను గృహప్రవేశాలను చేయించాలని, దీన్ని హౌసింగ్ ఏఈ, ఎంపీడీవో పర్యవేక్షించాలని తెలిపారు. ఉగాది లోపు పూర్తయిన ఇండ్లను నిర్దేశించిన లక్ష్యం ప్రకారం గృహప్రవేశాలు చేయించాలని ఎంపీడీవోకు ఆదేశించారు, సిరిగిరి పురంలో పాలిటెక్నిక్ భవనానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. తర్వాత సిరిగిరి పురం ప్రాథమిక పాఠశాల ను సందర్శించిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అక్కడ ఉన్న చిన్నారులతో ముచ్చటించారు,అక్కడ స్మార్ట్ డిజిటల్ బోర్డ్ ట్యాబ్ లు ఇతర మౌలిక సదుపాయాలు అన్నీ ఉన్నప్పటికీ   అడిగిన ప్రశ్నలకు  విద్యార్థులు సమాధానం చెప్పకపోవడంతో పాఠశాల హెడ్మాస్టర్  అధ్యాపకులకు పై ఆగ్రహం వ్యక్తం చేశారు, ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తున్నప్పటికీ విద్యార్థులకు సరైన విద్యను అందించడం లేదని దీనిపై గ్రామపంచాయతీ సర్పంచ్ బాధ్యత తీసుకొని పర్యవేక్షించాలని సూచించారు,తర్వాత గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇన్చార్జ్ ఎంపీడీవో, పంచాయతీ సెక్రటరీలతో సిరిగిరి పురం లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కేవలం పారిశుధ్యం ఒకటే కాదని అన్ని రంగాల్లో అభివృద్ధి పనులను చేపట్టాలని దీనికి పై ఎప్పటికప్పుడు మండల స్థాయి అధికారులు అంతా కలిసి వారి యొక్క ప్రణాళికారిపై ప్రగతి నివేదికలు పంపాలని ఆదేశించారు,ఈ కార్యక్రమంలో కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో, తాసిల్దార్ కార్యాలయ డిటి నరేష్, గిరిధర్, రాజు, సిరిగిరి పురం సర్పంచ్  కృష్ణవేణి శ్రీను, ఉప సర్పంచ్  సెక్రటరీలు, గ్రామపంచాయతీ సిబ్బంది   పాల్గొన్నారు.

Tags: