ముస్లిం సోదరులకు జగదీష్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు

ముస్లిం సోదరులకు జగదీష్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు

 విశ్వంభర, సూర్యాపేట: రంజాన్ పర్వదినం సందర్బంగా ముస్లిం సోదరులందరికీ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి  శుభాకాంక్షలు తెలిపారు. అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని, పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు ఫలించాలని, .త్యాగాలకు, మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అని ఆయన అన్నారు. తెలంగాణాలో కుల, మతాల ఐక్యతను పెంచిన ఘనత కెసిఆర్ ది అని, అయన హయాంలోనే  పండుగల ప్రాధాన్యత పెంచుకున్నం అని చెప్పారు. అన్ని మతాల ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహించుకుంటున్నామని, గాంధీ లాంటి మహనీయుల కళలు సాకారం చేసిన నాయకుడు కెసిఆర్ అని అన్నారు. గంగా జమున తహజీబ్ లా తెలంగాణాలో అన్నీ మతాలు కలిసిమెలసి జీవిస్తున్నామని, గత పన్నెండ్లుగా పండుగలన్నీ ప్రశాంతవతావరణంలో ఆనందంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఇదే సంసృతిని ముందుతరాలకు అందేలా కొనసాగించుకుందాం అని, ఈ ఏడాది కూడా రంజాన్ పండుగను ఐక్యతతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పారు.

Tags: