ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం
On
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని గంగారం గ్రామానికి చెందిన మంకాల శ్రీనాథ్ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం నుండి నిరుపేదలకు వచ్చిన సందర్భంగా కట్టుకున్నామని శ్రీనాథ్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ఈ సందర్భంగా సర్పంచ్ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీ లో మరిన్ని ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేందర్, ఇందిరమ్మ కమిటీ పాండు నాయక్, వార్డ్ మెంబర్స్ రవి, మోహన్, ధర్మ, గోపి, శ్రీనివాస్, భాస్కర్, దేవా,గ్రామ సెక్రెటరీ నవీన్ యాదవ్, హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.



